బోర్లా పడుకొని నిద్ర పోతే... ముఖం పై ముడతలు

Suka Samsaram
0
మీరు బోర్లా పడుకొని నిద్రపోతుంటరా? ముఖాన్ని దిండకేసి నొక్కుతూ పడుకునే అలవాటుందా? అయితే ముఖంపై మడతలు పడుతున్నాయేమో, చర్మం సాగిపోతోందేమో ఓసారి చూసుకోండి. ఎందుకంటే బోర్లా పడుకునేవారికి ఇలాంటి సమస్యలు పొంచి ఉంన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోజూ ముఖాన్ని దిండుకు నొక్కుతూ పడుకుంటే దాని ఒత్తిడి, ఘర్షణ మూలంగా చర్మంపై ముడతలు పడే ప్రమాదముంది. దిండు చర్మం నుంచి నూనెలను పీల్చుకోవం వల్ల తేమా తగ్గుతుంది. ముఖం చర్మంలోని సన్నటి నారలు (కొల్లజెస్) దెబ్బతింటాయి. సింథటిక్ వస్ర్తాల మీద చర్మం రుద్దుకోవం వల్ల మెటిమలు వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి ముఖం అందంగా కనబడాలంటే వెల్లకిల పడుకోవడం మంచిది. మనం పడుకునే విధానాలు కూడా ముఖంపై మడతలు పడటనికి కారణమవుతాయి. పక్కలకు తిరిగి పడుకునే వారికి చెంపలు, గదమలపై మడతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దిండుకు ముఖం ఆనించి బోర్లా పడుకునేవారికి నుదురుపై మడతలు ఎక్కువ. రాత్రుళ్లు వీలైనంత త్వరగా పడుకొని పెందలడే లేవడం కూడా చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో రోగనిరోధశక్తి స్ధాయిలు స్థిరంగా ఉండి చర్మం, వెంట్రుకలు మెరుగ్గా ఉంటాయి. అలాగే రాత్రిపూట ఏడు గంల పాటు నిద్రపోవడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా, నల్లబడకుండా (పిగ్మెంటేషస్) ఉంటుంది. బోర్లా పడుకోవం వల్ల ఒక్క చర్మం మాత్రమే కాదు.. జీర్ణ ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి వెల్లకిల పడుకోవం అన్నింటికన్నా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top