నిద్రలేమి సమస్యా... ఇలా చేసి చూడండి

Suka Samsaram
0

చాలా మందికి నిద్ర సమస్య వేధిస్తూ ఉంటుంది. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎంతకీ నిద్రపట్టదు. ఇలాంటి ముందు కొన్ని పాటి చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు చెపుతున్నారు.



  • మీలోనున్న ఒత్తిడి కారణంగా లేదా మనసులో అలజడి కారణంగా కూడా నిద్ర రాదు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి లేదా మంచి సాహిత్యం చదవండి లేదా ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను చదవండి. ఇలా చేస్తే మనసు కాస్త కుదుటపడి గాఢమైన నిద్ర రావడానికి ఆస్కారం ఉంటుంది.

  • రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలపాటు నడవడం అలవాటు చేసుకోండి. ఆదీంతో మంచిగా నిద్ర పట్టడమే కాకుండా జీర్ణక్రియ కూడా పెరగుతుంది.
  • మీరు పడుకునే మంచం లేదా పడక ఏదైనా కావచ్చు మీకు అనువైన రీతిలో ఉండే విధంగా తయారు చేసుకోండి. లేకుంటే నిద్రలో తేడాలొచ్చి మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం వుంది.
  • నిద్రలేమితో బాధపడుతుంటే మీ ముఖం, కాళ్ళు, చేతులు చల్లటి నీటితో కడుగుకోండి. దీంతో నిద్ర తప్పక వస్తుంది.
  • పడుకునే ముందు రోజంతా చేసిన పనిని మర్చిపొండి. మరుసటి రోజు చేయవలసిన పనిని గురించి ఏమాత్రం ఆలోచించకండి. అన్ని విషయాలను ఉదయం వరకు మర్చిపొండి. మరుసటి రోజు పనిగురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరిగి నిద్ర పట్టదంటున్నారు వైద్యులు.
  • ఒకవేళ మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, నిద్రమాత్రలు వాడుతుంటే మీరు యోగా నిపుణులను సంప్రదించండి. వారి సలహాలు పాటించి శ్వాసక్రియను పాటించండి. రాత్రి పడుకునేముందు శ్వాసను పూర్తిగా తీసుకోని వదలండి. దీంతో మీ మస్తిష్కానికి ప్రాణావయువు చేరి మీకు నిద్ర సంపూర్ణంగా వస్తుంది.
  • మంచి నిద్రకు మీ గదిలో గాలి సౌకర్యం బాగుండాలి. పడుకోవడానికి బయటి వాతావరణం అనుకూలంగా ఉంటే గది బయట పడుకోండి లేదా పైకప్పుపై పడుకోండి. మీ గదిలో కూలర్, ఫ్యాన్ లేదా ఎయిర్ కండీషనర్ శబ్దం ఎక్కువగా ఉంటే వాటిని రిపేరు చేయించండి. ఎందుకంటే శబ్దాలవలనకూడా నిద్ర రాదు.
  • నిద్రపోయేముందు టీ- కాఫీల్లాంటివి వాడకండి. దీంతో మస్తిష్కంలోని సిరలు ఉత్తేజం చెంది నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top