కంటి కింది నల్లని చారలు తగ్గలంటే...

Suka Samsaram
0
కళ్ల కింద నల్ల చారలొస్తే చాల ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు చేసుకుంటే అవి తగ్గు ముఖం పట్టే అవకాశం వుంది. వాటిని తగ్గించడానికి ఇంట్లోనే చేసుకోగల చిట్కాలు....

  • నల్ల చారలు తగ్గించడం కోసం టొమాటో జ్యూస్ చాల బాగ ఉపయోగపడుతుంది. టొమాటోలోని ఔషధ గుణాలు శరీరం మీద ఉన్న నల్ల మచ్చల్ని తొలగించేందుకు సహాయపడతాయి. ఈ జ్యూస్‌తో మర్దన చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలకు నీటితో శుభ్రం చేసుకుంటే నల్ల చారలు తగ్గే అవకాశం వుంది.

  • మార్కెట్‌లో నిత్యం అందుబాటులో ఉండే తాజా కీర దోసను తీసుకుని అప్పటి కప్పుడు ముక్కలుగా కోసి కాసేపు కళ్ల మీద ఉంచుకుంటే మంచిది
  • కీర దోస రసాన్ని తీసి కళ్ల కింది నల్ల చారలకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే కోంత ఉపశమనం లభిస్తుంది.
  • దోస రసంలో బంగాళదుంప రసాన్ని కలిపి ఇలాగే చేయవచ్చు. దీనివల్ల కూడా నల్ల చారల సమస్య తగ్గుతుంది.
  • ఆరెంజ్ జ్యూస్ జ్యూస్‌లో కాస్త గ్లిజరిన్ కలిపి వారానికి మూడుసార్లు రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.
  • మార్కెట్‌లో దొరికే ఆల్మండ్ ఆయిల్ చక్కటి ఔషధం. జుట్టుకు మాత్రమే కాదు. కళ్ల కింద నలుపు చారల్ని వదిలించుకునేందుకు ఈ నూనెను వాడుకోవచ్చు.
వీటితో పాటు మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, కంటి నిండా నిద్రపోవడం, సమతులాహారాన్ని తీసుకోవడంతో పాటు వీలైనన్ని మంచి నీళ్లను తాగితే కళ్ల చారల సమస్య నుంచి బయట పడవచ్చు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top