స్లిమ్ గా ఉండడానికి కోన్ని సలహాలు

Suka Samsaram
0
Slim
ఇప్పుడు స్లిమ్ గా ఉండటం ఆదర్శం కాదు. అవసరం. సన్నగా ఉండడామే అందానికి గుర్తు. సన్నగా ఉండటం, సన్నగా ఉండాలని కోరుకోవడంలో ఇప్పుడు సౌందర్య దృష్టి కన్నా ఆరోగ్య పరమైన అవసరమే ప్రధానంగా కనబడుతుంది.
ఇప్పుడు మహిళలైన అయినా, పురుషులైన అయినా లావుగా ఉన్నారంటే అందం ప్రశ్న కన్నా అనారోగ్యం రావటం ఖాయం. అందుకే ఇప్పుడు అందంగా, సన్నగా, ఆరోగ్యంగా ఉండటం స్త్రీపురుషులిద్దరికీ అత్యవసరమైపోయింది.
ప్రాణాంతక వ్యాధులన్నీ ఊబకాయం వల్లే వస్తున్నాయని నిర్ధారణ అవుతుండడాం వల్ల ఆరోగ్య అవసరాల కోసం మనిషి స్లిమ్గా ఉండటం తప్పనిసరి అయిపోయింది.

స్లిమ్ గా ఉండడానికి కోన్ని సూచనలు

  • మంచినీళ్లు వీలయినంత ఎక్కువగా తాగాలి.
  • మధ్యాహ్నం మితంగా భోజనం చేయాలి.
  • కొవ్వు పదార్థాలన్న ఆహారం ముట్టొద్దు,.
  • స్వీట్లు వీలయినంతగా తగ్గించాలి.
  • అతిగా ఫలహారం ఆరగించడం మానివేయాలి.
  • ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు వంటివి ఆహారంలో తీసుకోవాలి.
  • రాత్రి పూట నూనెలేని గోధుమ చపాతీలనే తినాలి.
  • భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు.
  • ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం కోసం కేటయించాలి.
  • దోసకాయ, ముల్లంగి, క్యారెట్, టమోటో ముక్కలు వంటివి తినడం అలవాటు చేసుకోవాలి.
  • వేడినీటి స్నానం కంటే చన్నీటి స్నాన్నం నయం
  • శరీరం అలసిపోయేలా పనిచేస్తే రక్తప్రసారం బాగా జరిగి, కొవ్వు పదార్థం కరుగుతుంది. కొవ్వు తగ్గినప్పుడు శరీరం తేలికవుతుంది.
  • రాత్రి భోజనం 8 గంటలలోపు పూర్తి చేయండి.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top