కళ్ల సంరక్షణకు...

Suka Samsaram
0
Eye care
అన్ని అవయవాల్లో కళ్లు ప్రధానమైనవి. అలాంటి కళ్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవాలి. మీ చూపు పదిలంగా పదికాలాలు ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే. అవేమిటంటే...
  • వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చేత్తో నలపడం కానీ, రుద్దడం గానీ చేయకూడదు. చేతికున్న మట్టి, ధూళికణాలు, సూక్ష్మక్రియుల కంటిలోకి చేరి అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ను కలిగించే ప్రమాదముంది.
  • వంటచేసేటప్పుడు వేడి అవిరి కళ్లకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలో ధుమ్ముపడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని చేతివేళ్లతో నీటిని కళ్లమీద చిలకరించి మెత్తని గుడ్డతో కళ్లు తుడుచుకోవాలి.
  • కళ్లను రోజుకు వీలైనంత వరకు రెండుసార్ల కన్నా ఎక్కువ కడగవద్దు.
  • కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.
  • కళ్లలో మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు ఏదో తమకు తోచిన మందులు, చిట్కాలు వాడకుండా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలి.
  • ఎప్పుడూ కూడా నెంబరులేని కళ్లజోళ్లను ధరించకండి.
  • చలువ అద్దాలు వాడేటప్పుడు అవి అల్ట్రావైలెట్ కిరణాల నుంచి కాపాడే విధంగా ఉండాలి.
  • మీ చూపుసరిగ్గా కనపడకపోయినా దృష్టిలో ఏదైనా లోపం ఉన్నా డాక్టరు సలహా లేకుండా మీకంట్లో ఏ విదమైన మందులు వేయకండి.
  • సంవత్సరంలో ఒకసారైనా తప్పనిసరిగా పూర్తి కంటిపరీక్షలు జరిపించుకోండి.

కంటికి ఆరోగ్యంతో పాటు అందం కూడా అవసరం.  కళ్లు అందంగా కనపడాలంటే కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. అవేమిటంటే...
  • కంటి అందాన్ని పెంచేందుకు కంటి మేకప్ కోసం గుర్తింపు పొందిన కంపెనీ ప్రొడక్టులనే వాడాలి. లేదంటే వేరే వాటి వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.
  • కాటుక దిద్దిన కళ్లచూపు చాలా శృంగార భరితంగా ఉంటుంది. అయితే కాటుక పెట్టుకునేటప్పుడు చేతివేళ్లు శుభ్రంగా లేకపోతే క్రిములు కంట్లోకి ప్రవేశించి లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల చేతులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
  • కనురెప్పల వెంట్రుకలు నలుపు రంగుతో సింగారిస్తే కళ్లు పెద్దవిగా చాలా అందంగా ఉంటుంది. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
  • కళ్లకు మంచి షేప్ రావడం కోసం ఐ లైనర్ను వాడతారు. దీన్ని వాడేటప్పుడు కంట్లో చిన్న చుక్క కూడా పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.
  • కంటిమేకప్ను తొలగించడానికి ప్రత్యేకమైన ఆయిల్ ను మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే బేబీ ఆయిల్ వాడవచ్చు.
  • కంటి మేకప్ ను అవసరం తీరిన తర్వాత తొలగించేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కళ్లకు ప్రమాదం జరగవచ్చు. కొందరు మహిళలు మేకప్ తొలగించడం కోసం దూదిని నీటిలో ముంచి శుభ్రం చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు.
  •  అలసిన కళ్లు విశ్రాంతి పొందాలంటే గోరువెచ్చని నీటిలో ముంచిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచాలి. 
  • కళ్లు అలసినప్పుడు ముఖం కాంతివిహీనంగా ఉంటుంది. కళ్లకు ఎంత మేకప్ చేసినా సరి అవ్వదు. అలాంటప్పుడు చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పల మీద ఉంచాలి. దీనివలన కళ్లపై ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top