పట్టు లాంటి కురుల కోసం... ఇంటి చిట్కాలు

Suka Samsaram
0
Hair Care
వెంట్రుకలు పట్టుకుచ్చులా ఉండాలని ఆశపడని అమ్మాయి ఉండదని అంటే అతిశయోక్తి కాదేమో. ముఖానికి అందాన్నిచ్చేది ఒత్తయిన జుట్టే. అలాంటి జుట్టు పట్టులా మెరిసిపోవడానికి కోన్ని చిట్కాలు

 ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం  : రెండు అరటిపండ్లను మెత్తని గుజ్జులా చేసుకోని. దానికి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే.. జుట్టుపట్టులా మెరుస్తుంది.
  • వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వులనూనె సమపాళ్లలో కలిపి, తలకు రాసుకోవాలి.
  •  ఒక కోడిగుడ్డులోని సొనను గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ మిశ్రమానికి కలిపి తలకు పట్టించి అరగంట సేపు ఉంచాలి. తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.
  •  కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలు ఉడికించి వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్లవెంట్రుకలు నల్లగా మారతాయి.
  • ఉసిరిపొడిని ఇనుపపాత్రలో రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే ఆ మిశ్రమం బ్రష్ తో తలకు పట్టించండి.
  • ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడుకప్పుల నీరు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తరువాత  తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని కనీసం మూడు సార్లు జుట్టుకు పట్టించాలి. తరువాత చల్లని నీటితో జుట్టు శుభ్రపరచుకుంటే మృదువుగా ఉండడమే కాక వత్తుగా పెరుగుతుంది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top