తెల్ల వెంట్రుకలు ముసలితనాన్ని గుర్తు చేస్తాయి. అయితే, ఈ మధ్య కాలంలో చాలామందికి యుక్త వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. పెరిగే వయస్సుతో పాటు తెల్ల వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా 1 లేక 2 వెంట్రుకలతో మొదలై చాలా త్వరగా తలంతా వ్యాపిస్తాయి. వీటి బారి నుండి తప్పించుకోవడానికి చాలమంది తెల్ల వెంట్రుకలు పీకేస్తారు. ఇలా చేయడం వల్ల వెంట్రుక మొదళ్ళలలో వున్న రసాయనాలు ప్రక్క వాటికి వ్యాపించి అవి కూడా తెల్లబడే అవకాశం ఉంది. ఇలా 1 లేక 2 వెంట్రుకలు ఉన్నవారు చిన్న కత్తెరతో కుదురు దగ్గరగా కత్తిరించుకోవచ్చు. చాల వరకు వాటంతట అవే రాలిపోతాయి. తెల్ల వెంట్రుకలు కవర్ చేయడానికి డై వేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు.
యూరప్ దేశాలలో డైయింగ్ ఫ్యాషన్ గా మారిపోయింది. లేడీస్ రకరకాల రంగులతో హెయిర్ ని కలర్ చేస్తారు. మన దేశంలో మాత్రం బ్లాక్ డై మాత్రమే నాచురల్ గా ఉంటుందని ఎక్కువగా వాడతారు.వెంట్రుకలు తెల్ల పడడానికి కారణాలు :
- వయస్సు పెరిగే కొద్ది వెంట్రుకలలో వున్న పిగ్మెంట్ సెల్స్ తగ్గిపోయి వెంట్రుకలు నల్లగా ఉంచే మెలనిన్ అనే రసాయనం గుణం తగ్గిపోవడం తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇదే కాకుండా
- అనారోగ్యం
- ఏదైన భయంకరమైన సంఘటన చూసి షాక్ తినడం వల్ల
- టైఫాయిడ్, మలేరియా మరియు ఇతర ఇన్ ఫేక్షన్ ల వలన కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయి.
పై కారణాలు ఏవి లేకపోయిన కొంత మందికి తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇలా జరగడానికి ప్రత్యేక కారణం అంటు ఏమి ఉండగా పోవచ్చు.
డై చేయడానికి కావలసిన వస్తువులు
- బ్లాక్ హెన్నా పౌడర్
- కాటన్
- నేప్కిన్
- హ్యాండ్ గ్లోవ్స్
- ప్లాస్టిక్ లేక ఫైబర్ గిన్నె
- డై బ్రష్
డై చేసే విధానం :
డై చేసుకోవడంలో చాల జాగ్రత్తలు వహించాలి. బాడీ షేప్ ను బట్టి డై చేయడం చాల అవసరం. వెంట్రుకలు డై చేయడంలో 3 పద్దతులున్నాయి.
1. షాంపులతో కాని కలరింగ్ ఆయిల్స్ తో కాని
2. హెర్బల్ డై లు
3. కెమికల్ డై లు
డై చేసుకోవడంలో చాల జాగ్రత్తలు వహించాలి. బాడీ షేప్ ను బట్టి డై చేయడం చాల అవసరం. వెంట్రుకలు డై చేయడంలో 3 పద్దతులున్నాయి.
1. షాంపులతో కాని కలరింగ్ ఆయిల్స్ తో కాని
2. హెర్బల్ డై లు
3. కెమికల్ డై లు
1. షాంపులు లేదా కలరింగ్ ఆయిల్స్ తో : ఇవి ఎక్కువగా ఫారన్ దేశాలలో వాడుతుంటారు. ఇవి మన దేశం లో దొరకడం కష్టం కాబట్టి మన వాళ్ళ ఎక్కువగా హెర్బల్ లేదా కెమికల్ డై లనే వేసుకోంటారు.
2. హెర్బల్ డై :
ఈ రకమైన డైలు పర్మనెంట్ కావు. వీటిని ఉపయోగించడానికి చాల సమయం పడుతుంది. హెర్బల్ డైలు బ్రౌన్, డార్క్ బ్రౌన్ కలర్స్ లో లభిస్తాయి. ఈ కలర్ రావడానికి చాల సమయం పడుతుంది. కొన్ని నెలల పాటు వీటిని వాడవలసి వస్తుంది. ఇలా చేసిన ఆ కలర్స్ ముఖానికి సూట్ అవుతుందని గ్యారంటీ లేదు. కనుక చాల మంది కెమికల్ డైలనే ఉపయోగిస్తారు.
3. కెమికల్ డైలు
ఇవి చాల సహజంగా ఉంటాయి. వాతావరణం వల్ల కాని, సబ్బు, షాంపుల వల్ల కాని ఈ కలర్ పోయే అవకాశం లేదు. ఈ డై పారా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో తయారు చేస్తారు. ఇవి అన్ని చోట్ల దొరుకుతాయి.
ఈ కెమికల్ డైటు వాడేటప్పుడు Patch Test చేసి వాడాలి. మిశ్రమాన్ని కొద్దిగా తీసుకోని చెవి వెనక రాసుకోని ఇరవై నాలుగు గంటలు ఉంచాలి. దురదా కాని మంట కాని లేకపోతే డై వాడవచ్చు.
డై ని వాడే ముందు షాంపుతో తల శుభ్రంగా కడగాలి, తరువాత డై ని గిన్నెలో తీసుకోని వెంట్రుకలను పాయలు పాయలుగా తీసి డై బ్రష్ తో పూయాలి. 30 నుంచి 40 నిమిషాల తరువాత నీళ్ళతో వాష్ చేయాలి. మంచి ఫలితం రావడానికి 48 గంటల వరకు షాంపు చేయకూడదు.
మార్కెట్లో దొరికే కొన్ని కెమికల్ డైలు
- Godrej
- Black Rose
- Black Stone
- Begin
- Tru-Tone
- Wondrex,
డై ఉపయోగించకూడని సమయాలు, ప్రదేశాలు
- కనుబొమ్మలకు
- కనురెప్పలకు
- గర్భధారణ టైంలో
- Menstruation
- పిల్లలకు పాలు మానేసే దాకా
- చర్మ వ్యాధులు ఉన్నప్పుడు
- ఆస్మా, కిడ్నీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు
- డై చేసేటప్పుడు మంటగా ఉంటే
- జుట్టు రాలుతున్నప్పుడు మరియు బాగా డ్రై గా వున్నప్పుడు