చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు రాకుండా...

Suka Samsaram
0
ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు రావడం చాలమందిలో కనబడుతుంది.  అలా రాకుండా ఉండాలంటే మానసిక అంధోళనలకు గురి కాకుండా, మంచి పోషక ఆహారం తీసుకుంటే  ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఈ సలహాలు పాటించి చూడండి...

ప్రోటీన్ ఆహారము ఎక్కువగా తీసుకోండి.

  • ప్రోటీన్స్ ఎక్కువగా మొలకలు, ధాన్య సంబంధిత వాటిల్లో, మాంసము, సోయా చిక్కుళ్ళలోనూ ఉంటాయి.
  • విటమిన్ ఎ, విటమిన్ బి ఎక్కువగా గల ఆహరం తీసుకొండి.  ఈ విటమిన్లు ముదురు ఆకుపచ్చ కూరగాయలలో, పసుపు రంగు ఉండే పళ్ళలో అధికంగా ఉంటాయి. తాజా ఆకుపచ్చని ఆకుకూరల్లో, అరటి కాయల్లో, టమోటా, క్యాలీ ఫ్లవర్, పప్పు ధాన్యాలు, లివర్, కిడ్ని, పెరుగు, గోధుమలలో విటమిన్ బి వుంటుంది.
  • ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఐరన్ లాంటివి తీసుకోండి. ఎర్రగా ఉండే మాంసములోనూ, ఆకుపచ్చని కూరగాయల్లోను జింక్ ఎక్కువగా ఉంటుంది.
  • ఐరన్ ఎక్కువగా ఉండే ఎండిన ఆప్రికాట్స్, కొత్తిమీర, గుడ్లులోని పచ్చసొన, ధాన్యము ఆహారంలో ఉండేలా చూసుకొండి.
  • సన్ ఫ్లవర్ నూనె, జీడిమామిడి, ఆల్మండ్ తీసుకొండి. వీటీలో కాపర్ ఎక్కువగా ఉంటుంది.
  • వీటిలో పాటు  అయొడిన్ ఉండే అరటికాయలు, చేపలు, క్యారెట్ల వంటివి కూడా తీసుకొండి.
కాఫీ, టీల కన్న మజ్జీగ ఎక్కువగా తీసుకోండి. మజ్జికలో నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు లభిస్తాయి.
  • చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిన వారు, తాజా అల్లాన్ని తీసుకొని అరగ తీసి తేనేతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది.
  • ఆమ్లాలను తలపై రుద్దు కోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది.
  • కొబ్బరి నూనెను నిమ్మపండు రసంతో జతచేసి జుట్టుకు మసాజ్ చేసుకొండి.
  • పాలు కలవని టీ డికాక్షన్ లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి, తెల్లబడిన జట్టు ప్రాంతంలో మెత్తగా మసాజ్ చేసుకొని. ఓ గంట పోయాక తలస్నానం చేయండి.
రెండు టీ స్పూన్ల హెన్నా పౌడర్ తీసుకొని, ఒక టీ స్పూన్ పెరుగు ఒక టీ స్పూన్ మెంతులపోడి, మూడు టీ స్పూన్ ల పొదీన రసంను కలపి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించి, రెండు లేదా మూడు గంటల తరువాత షాంపుతో స్నానం చేయండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top