ముఖం, మెడ ఒక కలర్‌లో ఉండి శరీరమంతా వేరే కలర్‌లో ఉన్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలతో శరీరం మొత్తం ఒకటే రంగులో ఉండేలా చూసుకోవచ్చు. అందుకు ఈ కింది చిట్కా ఉపయోగపడుతుంది.
కావాల్సినవి:
పాల మీగడ - 1 టీస్పూన్
బాదం పౌడర్ - 1 టీస్పూన్
రోజ్ వాటర్ - 2 టీస్పూన్లు
గుడ్డులోని తెల్లసొన - 1 టీస్పూన్
పాలు - అరకప్పు
వీటన్నింటిని బాగా మిక్స్ చేసి ముఖం మరియు మెడ భాగాలలో అప్త్లె చేయాలి. 20 నిమిషాల వరకు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా వారానికి 3 సార్లు చేయండి. మీ శరీరం, ముఖం అంతా ఒకే రంగులోకి మారుతుంది.
