నల్లటి మచ్చలు పోవాలంటే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. వాటితో పాటు కొన్ని ప్యాక్స్‌ను కూడా తప్పనిసరిగా వాడాలి. అవి...
- నల్ల మచ్చల నివారణకు తేనె కూడా మంచి హెర్బల్ బ్లీచ్‌గా ఉపయోగపడుతుంది. మచ్చలున్న ప్రాంతంలో రోజూ తేనె అప్త్లె చేయడంకూడా మంచి పద్ధతే.
- ఉడికించిన క్యాబేజి గుజ్జుని ముఖంపై పేస్టులా అప్త్లె చేసి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఫేస్‌వాష్ చేసుకోవాలి. అప్పుడు మంచి ఫలితాన్ని చూడగలరు.
- ఒక టీ స్పూన్ ఉల్లిపాయ రసానికి, టీ స్పూన్‌లో సగం తేనె కలిపి చర్మానికి అప్త్లె చేసుకోవడం కూడా ఒక మంచి ట్రీట్‌మెంట్
- ఒక టీ స్పూన్ కీరా రసం, దోసకాయ రసం తీసుకొని, 4 చుక్కల నిమ్మరసం, టీ స్పూన్‌కి సగం ముల్తానీ మట్టి కలిపి బాగా మిక్స్ చేయాలి. చర్మం మీద మచ్చలు ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమం అప్త్లె చేయాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితం పొందవచ్చు.
- ఒక టీ స్పూన్ పెరుగుకు, ఒక టీ స్పూన్ తేనె కలపి అప్త్లె చేసుకోవడం కూడా మేలైన పద్ధతే.
పైన చెప్పిన పద్ధతులన్నీ వారానికి నాలుగు సార్లు ప్రయత్నించి చూడండి. అలాగే, పైన పేర్కొన్న ప్యాక్‌లన్ని వారానికి 4 సార్లు అప్త్లె చేసి 15 నిముషాలు నుండి 20 నిముషాల వరకు ముఖం మీద ఉండేటట్లు చూసుకొని, తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా 2 నెలలు ప్రయత్నించి చూస్తే నల్లటి మచ్చలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
