పిగ్మంటేషన్‌ సమస్యకు పరిష్కారం

Suka Samsaram
0
పిగ్మంటేషన్‌ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. మొదట లైట్‌ బ్రౌన్‌ కలర్లో ఒక ప్యాచ్‌లా శరీరంపై కనిపిస్తుంది. దానిని మనం మొదటి దశలోనే గుర్తించి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వేగంగానే విముక్తి పొందవచ్చు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్యాచ్‌ రంగు ఇంకా ముదిరి, ట్రీట్‌మెంట్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. పిగ్మంటేషన్‌ స్టేజ్‌ను బట్టి కొన్ని ప్యాక్‌లు వాడితే, మచ్చల రంగు తగ్గేలా చేయవచ్చు. శరీరఛాయ తెల్లగా ఉన్నవారికి, పిగ్మంటేషన్‌ మచ్చలు శరీర రంగులోకి మారడం కొంచెం కష్టమే. అయితే శరీరం ఛామనఛాయ రంగులో ఉన్నవారికి మచ్చలు క్రమంగా తగ్గడంలో కొంచెం వెసులుబాటు ఉంటుంది.

పిగ్మంటేషన్‌ సమస్య నివారణకు చిట్కాలు
  • ఒక టీ స్పూన్‌ దోసకాయ రసానికి టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌కి సగం నిమ్మరసం కలపాలి. పిగ్మంటేషన్‌కు గురైన చోట మృదువుగా ఈ మిశ్రమాన్ని అప్త్లె చేయాలి.
  • మర్రిచిగుర్లు, పచ్చపెసర్లు సమానంగా తీసుకొని, తగినన్ని ఆవుపాల తో కలిపి, బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పిగ్మంటేషన్‌కు గురైన చోట రోజూ అప్త్లె చేస్తే కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితాన్ని చూడవచ్చు. 
  •  బంగాళదుంపలను చక్రాల మాదిరిగా కట్‌ చేసి ఎక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ రుద్దాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేయాలి.
  • కలబంద గుజ్జులో టీ స్పూన్‌లో సగం నిమ్మరసం కలిపి పిగ్మంటేషన్‌ ప్రభావం ఉన్న చర్మం దగ్గర అప్త్లె చేసి, మసాజ్‌ చేయాలి. అలా చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top